హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాజంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర అభినందనీయం: ఎస్సై

సమాజంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర అభినందనీయమని చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ అన్నారు. బుధవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ఎస్సై చంద్రమోహన్ హాజరై మాట్లాడుతూ మానవ జీవితంలో మరుపురాని మధుర క్షణాలను, అరుదైన ఘట్టాలను ఫ్రేమ్ కట్టి తరతరాలకు అందించే గొప్ప కళ ఫొటోగ్రఫీ అన్నారు. ప్రజాచైతన్యానికి దోహదపడటంలో ఫొటోగ్రాఫర్ల శ్రమ దాగి ఉందన్నారు.