SRD: జిన్నారం మున్సిపాలిటీ, బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ భాగస్వామ్యంతో వీధి కుక్కలకు జనన నియంత్రణ శస్త్రచికిత్సలు, యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నారు. వీధి కుక్కలను చంపడం, తరలించడం పరిష్కారం కాదని అధికారులు తెలిపారు. చెత్త, వ్యర్థ ఆహారాన్ని తొలగిస్తే కుక్కల సంచారం తగ్గుతుందని పేర్కొన్నారు. పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు వేయించాలని యజమానులకు సూచించారు.
తెలంగాణ
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు


