హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో ‘క్లీన్అప్’ యాప్ ప్రారంభం..!

ఖమ్మం నగర రోడ్ల పరిశుభ్రతను డిజిటల్‌గా పర్యవేక్షించేందుకు ‘ఖమ్మం క్లీన్అప్’ యాప్‌ను బుధవారం ప్రారంభించారు. క్లీన్ సిటీ లక్ష్యంతో 60 డివిజన్ల రోడ్లను శానిటేషన్ జవాన్లకు కేటాయించారు. శుభ్రం చేసిన రోడ్ల ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయగా, ఏఐ (AI) సాంకేతికతతో రియల్ టైమ్‌లో పరిశీలిస్తారు. దీనివల్ల ప్రతి డివిజన్‌లో రోడ్ల నిర్వహణ మరింత సులువవుతుంది.