హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పడిక్కల్

దేవదత్ పడిక్కల్ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగుల భారీ సెంచరీ చేసిన అతడు, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేశాడు. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ విజయం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు పడిక్కల్ పేర్కొన్నాడు. స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కొనడమే తమ విజయానికి కారణమని తెలిపాడు.