హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయాలి'

ASR: గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ట్రైబల్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఐ. రామకృష్ణ బుధవారం కోరారు. రోడ్లు, తాగునీరు, వైద్యం, విద్య, వ్యవసాయం,ఉపాధి అంశాలపై సమావేశంలో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఐటీడీఏ ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలన్నారు.