హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ASR హరిత-పంచవటి’ కార్యక్రమం

ASR: పాడేరు అటవీ డివిజన్ పరిధిలో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన ‘ASR హరిత-పంచవటి’ కార్యక్రమం కలెక్టర్ నిశాంతి బుధవారం ప్రారంభించారు. పంచాయతీల పరిధిలో పంచవటి వనాలను ఏర్పాటు చేసి, రావి, ఉసిరి, మేడి, మారేడు, సీతా అశోక వంటి ఐదు ముఖ్యమైన వృక్ష జాతులను పెంచాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.