హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

KMM: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అర్హులైన 12 మంది లబ్ధిదారులకు 100% సబ్సిడీపై త్రీ వీలర్ (ట్రై మోటార్) సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.