హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డంపింగ్ యార్డులో కమిషనర్ తనిఖీ

TPT: రామపురం సమీపంలోని డంపింగ్ యార్డును మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణ తనిఖీ చేశారు. సెప్టెంబర్ మూడో వారం నాటికి వ్యర్థాల నిర్వహణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ సైట్‌లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని ఆపరేటర్లకు సూచించారు. తనిఖీలో మున్సిపల్ అధికారులు, ఆపరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.