హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్‌అండ్‌ఆర్‌ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి చర్యలు

WNP: కొత్తకోట మండలంలోని కానాయిపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. లెవలింగ్, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.