పార్వతీపురం నియోజకవర్గంలోని రైతులకు ఎంతో కీలకమైన సాగునీటి వనరులైన అడారి గెడ్డ, వరహాల గడ్డ ప్రాజెక్టుల పనులను తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజయచంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం ఎమ్మెల్యే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుట్టారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వరహాల గెడ్డ పనులు పూర్తి చేయాలి'


