హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లు

RR: సరూర్‌నగర్ చెరువుల్లో గణేశ్ నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి డిమాండ్ చేశారు. ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం అయ్యేలా నీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూ, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.