హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్

SKLM: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ.. లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, సాధ్యం కాకపోతే నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు.