CTR: చౌడేపల్లి మండలం పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ చిప్పిలివారిపల్లిలో నెల రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. గ్రామానికి నీరు సరఫరా చేసే స్కీం బోరు ఎండిపోవడంతో ఓవర్‌హెడ్ ట్యాంకుకు నీరు చేరడం లేదు. దీంతో తాగునీటి కోసం చుట్టుపక్కల పొలాలకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బోరు ఎండిపోవడంతో నీటి సమస్య


