హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు

SS: కదిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోని నల్లచెరువు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ అధికారిణి ప్రమీల ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 10:30 గంటలకు కదిరి ఆర్‌డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.