SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామ చెత్త సంపద కేంద్రాన్ని డీపీవో ఆర్. గోపీబాల బుధవారం తనిఖీ చేశారు. సేకరించిన వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరుచేసి వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేయాలని క్లాప్ మిత్రలకు సూచించారు. దీనివల్ల పంచాయతీకి ఆదాయం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుమలదేవితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించిన డీపీవో


