హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విశాఖ మ్యూజియంలో ఫొటో జర్నలిజం వైభవం

VSP: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ మ్యూజియంలో వీపీజేఏ ఏర్పాటు చేసిన 'న్యూస్ ఇన్ ఫ్రేమ్స్' ఛాయాచిత్ర ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 26 మంది ఫొటో జర్నలిస్టులు తమ కెమెరాల్లో బంధించిన అరుదైన నగర చిత్రాలు వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు రెండు రోజుల పాటు సాగే ఈ ఉచిత ప్రదర్శన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతోంది.