హైదరాబాద్: 28°C
వ్యాపారం

BSEలో షిప్‌రాకెట్ గ్రాండ్ ఎంట్రీ

ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ 'షిప్‌రాకెట్‌' స్టాక్ మార్కెట్లో అదరగొట్టింది. ఈ కంపెనీ షేర్లు మదుపర్లకు మొదటి రోజే ఊహించిన దానికంటే మంచి లాభాలను అందించాయి. షేర్‌ ఇష్యూ ధర రూ.97 కాగా, BSEలో ఏకంగా 35% ప్రీమియంతో రూ.129.50 వద్ద గ్రాండ్‌గా లిస్ట్ అయ్యాయి. ఈ అద్భుతమైన లిస్టింగ్‌తో షిప్‌రాకెట్ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.9,901 కోట్లకు చేరుకుంది.