TPT: సూళ్లూరుపేటలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య చర్యలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో తాగునీటి బాటిళ్లు, ఇతర వ్యర్థాలు వేసేందుకు ఇనుప గ్రిల్స్ జాలీలు ఏర్పాటు చేశారు. బాటిళ్లను రోడ్లపై పడేయకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వ్యర్థాల కోసం ఇనుప గ్రిల్స్ ఏర్పాటు: మున్సిపల్ కమిషనర్


