హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు న్యాయవాది వరప్రసాద్‌కు సన్మానం

బాపట్లకు చెందిన శ్రీనివాస వరప్రసాద్ హైకోర్టు న్యాయవాదిగా ప్రమాణం చేశారు. బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘం సభ్యులు ఆయనను దుశ్శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. గత 12 ఏళ్లుగా రాష్ట్రంలోని మాజీ సైనికుల పెన్షన్, విద్య, వైద్య సమస్యలను పరిష్కరిస్తున్నారు. 2020లో సంఘాన్ని స్థాపించి 600 మందికి సేవలందించారు. ఇకపై కూడా మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.