హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరిడిమాంబ పండగ గోడ పత్రిక ఆవిష్కరణ

అనకాపల్లి పట్టణ కోట్ని వీధిలో ఈనెల 27న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే మరిడిమాంబ పండగకు ఏర్పాట్లు చేయాలని జనసేన నియోజకవర్గం సమన్వయకర్త భీమరశెట్టి రాంకి సూచించారు. ఈ మేరకు గోడపత్రికను బుధవారం ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా చూడాలన్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.