హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో ఉద్రిక్తత!

E.G: రాజమండ్రిలోని కృష్ణానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ 40వ వార్డులో కొంతమంది వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. అయితే మాజీ ఎంపీ మార్గాని భరత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.