కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కే. వెంకటేశ్వర్లు ఆసుపత్రిలోని పలు ఓపీ, ఓటీ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, విభాగాల నిర్వహణను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం లేకుండా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీ


