హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు సరకులు పంపిణీ

కోనసీమ: ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి 17 రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలను అమలాపురం అసెంబ్లీ ఇన్‌చార్జి డాక్టర్ పినిపే శ్రీకాంత్ పరామర్శించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.