సత్యసాయి: పుట్టపర్తిలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన సందర్భంగా సత్యమ్మ సర్కిల్ వద్ద టీడీపీ శ్రేణులు, బీసీ ప్రజలు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ.. బీసీలు రాష్ట్రానికి బ్యాక్‌బోన్ లాంటి వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బీసీ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ రిజర్వేషన్లపై పుట్టపర్తి టీడీపీ శ్రేణుల సంబరాలు


