హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనాన్ని మంజూరు చేయాలి'

VZM: మున్సిపల్ కస్పా హైస్కూల్‌లోని గురజాడ అప్పారావు బీసీ స్టడీ సర్కిల్‌ను ఉత్తరాంధ్ర జిల్లాల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద్దాడ మధు సందర్శించారు. అన్ని రకాల ఉచిత శిక్షణా తరగతులను ఒకే గదిలో నిర్వహిస్తుండటంతో నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. యువతకు మెరుగైన వసతులు కల్పించేందుకు బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.