హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శబరిమలై చేరుకున్న పెద్దిరెడ్డి

CTR: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శబరిమలై యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన పంబ నుంచి ఇరుముడి నెత్తిన పెట్టుకుని కాలినడకన శబరిమలై చేరుకున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆయనతోపాటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శబరిమలై వెళ్లారు.