ప్రకాశం: కనిగిరి బాలికల హైస్కూల్ విద్యార్థులు అమరావతి అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై మాట్లాడారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కలగడం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీలో కనిగిరి బాలికల హైస్కూల్ విద్యార్థులు


