హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

26 నుంచి శ్రీవారి అంతరాలయ దర్శనం

కడపలోని తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి ఆదేశించారు. బుధవారం ఆలయంలో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. ఈ నెల 23 నుంచి జరిగే అష్టబంధన మహా సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 26 నుంచి శ్రీవారి అంతరాలయ దర్శనం ప్రారంభమవుతుందన్నారు.