హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

50 మంది పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ

TPT: గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియం నందు బుధవారం ఉదయం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు 50 మందికి, చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కీర్తిశేషులు డాక్టర్ వేదాంతం విజయ సారధి ధర్మపత్ని శ్రీమతి మహాలక్ష్మి జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు రఘునాథ చక్రవర్తి వీటిని పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు.