PPM: కొమరాడలోని మరడాన వీధిలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. సీపీఎం మండల కన్వీనర్ సాంబమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో అధికారులు హామీ ఇచ్చినా నీటి సమస్య పరిష్కరించలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించకపోతే ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మంచినీటి కోసం మహిళల ఖాళీ బిందెలతో నిరసన


