VZM: రామభద్రపురం మండలం కొత్తరేగ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కోట అప్పలనాయుడు తండ్రి కోట అచ్చయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కొత్తరేగ చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోట అచ్చయ్యకు మాజీ ఎమ్మెల్యే నివాళి


