ELR: ఉంగుటూరు మండలం సీతారామపురం లో పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం 'స్వచ్ఛ పథం' కార్యక్రమం నిర్వహించారు. ఉంగుటూరు గ్రామంలోని ప్రధాన రోడ్లు, పాఠశాల చుట్టుపక్కల చెత్తను తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టారు. ఎంపీడీవో మనోజ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలన్నారు. పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీతారాంపురంలో 'స్వచ్ఛ పథం' కార్యక్రమం


