హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు

కృష్ణా: మచిలీపట్నంలో 187వ ఫోటోగ్రఫీ డేను ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్యురే విగ్రహానికి నివాళులర్పించారు. ముఖ్యఅతిథి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ.. సంక్షేమ భవనానికి ఐదు సెంట్ల స్థలం, యువతకు ఆధునిక శిక్షణ, వృద్ధులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరారు.