హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారం ఎవరికి శాశ్వతం కాదు: వైసీపీ ఎమ్మెల్సీ

తూ.గో: అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అధికార పక్షానికి అహంకారం పనికిరాదని YCP ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఛైర్మన్‌కు గౌరవం ఇవ్వకపోవడం దురదృష్టకరమని, ప్రజలు అధికారం ఇచ్చారు కానీ అహంకారం కాదని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. కూటమి పార్టీ సభ్యులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.