KRNL: కర్నూలు నగరంలో విధుల పట్ల అలసత్వం, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని నగర కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. ఇవాళ పాతబస్తీ, జొహరాపురం, ఏ.క్యాంపు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని గుర్తించిన 2వ శానిటేషన్ డివిజన్ డ్రైవర్ రాముపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
విధుల్లో నిర్లక్ష్యంపై కమిషనర్ ఆగ్రహం


