NLR: బుచ్చి మండలంలో యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తరలిపోతున్నట్లు స్థానికులు ఆరోపించారు. మండలంలోని దామరమడుగు పెన్నా నదిలో అక్రమ ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఓ పార్టీ నేత ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తోందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్
బుచ్చిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.?


