హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై హైకోర్టు ఆదేశాలు

KKD: తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మిస్సింగ్ కేసుకు సంబంధించి చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆచూకీ కోసం ప్రయత్నం కొనసాగాలని పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో తప్పిపోయినా చిన్నారుల జాబితాతో పాటు లభ్యమైన వివరాలను సమర్పించాలని సూచించింది.