హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పందుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని పలు వీధులు, కాలనీల్లో పందుల సంచారం అధికమవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల పరిసరాలు, రహదారులపై గుంపులుగా తిరుగుతున్న పందులతో పారిశుధ్యం దెబ్బతింటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల బెడదను అరికట్టి, వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.