హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: BRS డ్రామాలను ప్రజలు నమ్మరు: గోవర్ధన్ రెడ్డి

ADB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆపివేసిందనే BRS పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. బుధవారం పట్టణంలోని కార్యాలయంలో నాయకులతో సమావేశమై మాట్లాడారు. రాజకీయ లబ్ధికోసం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న డ్రామాలను ప్రజలు విశ్వసించరని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.