హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం: మంత్రి

HYD: డా. వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియాన్ని సమగ్రంగా పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని మ్యూజియాన్ని సందర్శించి.. క్రీ.పూ. 2500 ఏళ్ల నాటి ఈజిప్షియన్ మమ్మీని పరిశీలించారు. దాని సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనుల అంచనాలను వారంలోగా సమర్పించాలన్నారు.