SRPT: ప్రజలకు తక్కువ ధరకు అందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కోదాడ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు తరలిస్తున్న 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు బుధవారం తెల్లవారుజామున కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని దుర్గాపురం వద్ద పట్టుకున్నారు.
తెలంగాణ
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత


