హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి: ఎమ్మెల్యే

ASR: పాడేరు ఐటీడీఏ పరిధిలో 16 నెలలుగా పాలకవర్గ సమావేశం నిర్వహించకపోవడం గిరిజనుల దురదృష్టకరమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం బుధవారం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా ఏజెన్సీ సమస్యలపై చర్చించేందుకు ఒక్క పాలకవర్గ సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు. వెంటనే ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.