కోనసీమ: సీఎం చంద్రబాబు నాయుడును వెలగపూడి సచివాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ తీర్మానం చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను పరిశీలించి, సాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంను కలిసిన ఎమ్మెల్యే బండారు


