హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్రమ మద్యం వ్యవహారంతో వైసీపీకి సంబంధం లేదు'

ATP: తాడిపత్రిలో పోలీసులు పట్టుకున్న అక్రమ మద్యంతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ కార్యాలయం స్పష్టం చేసింది. టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. చికిత్స పొందుతున్న నాయకుడు హనుమంతరెడ్డిని పెద్దారెడ్డి పరామర్శించిన నాటి ఫోటోను మార్ఫింగ్ చేసి, అక్రమ మద్యం రవాణాదారుడు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది.