హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

NTR: నందిగామ పట్టణ రామన్నపేట రోడ్డులో నందిగామ ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ SI నరేష్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రయాణికుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు.