శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో అన్నపూర్ణ ఆశ్రమం వీధిలోని జనావాసాల్లోకి అరుదైన శ్వేత నాగు ప్రవేశించి హల్చల్ చేసింది. స్థానికులు అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్ ఓంకార్ త్యాడి సహకారంతో దానిని చాకచక్యంగా పట్టి, బంధించారు. అనంతరం సమీప అటవీ ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టారు. ఈ ప్రాంతంలో శ్వేత నాగు కనిపించడం ఇదే మొదటిసారి.
ఆంధ్రప్రదేశ్
అరుదైన శ్వేత నాగు హల్చల్


