అల్లూరి జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అధికారులు గ్రామాల్లో తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రంపచోడవరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో పారిశుద్యంపై శ్రద్ధ చూపాలన్నారు. దోమలు, ఈగలు పెరగకుండా మందులు స్ప్రేయింగ్ జరగలాన్నారు. గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోండి'


