హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూల రైతులపై ఎల్‌నినో ఎఫెక్ట్

సత్యసాయి: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం కారణంగా అగళి, మడకశిర మండలాల్లో పూల సాగు దెబ్బతింది. ఈ ప్రాంతాల్లో 1200 ఎకరాల్లో సాగవుతున్న చామంతి, మల్లె, కనకాంబరం దిగుబడులు తగ్గి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గడంతో పంట చేతికి రాలేదని రైతులు తెలిపారు. ఈసారి పెట్టుబడులు వచ్చే పరిస్థితీ లేదని వాపోతున్నారు.