హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ కట్‌.. తప్పిన ప్రమాదం

KDP: ముద్దనూరులో ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తాడిపత్రికి వెళ్తున్న బస్సు పాత బస్టాండు వద్దకు రాగానే స్టీరింగ్‌ కట్‌ అయి రోడ్డుపై నిలిచిపోయింది. బస్సు వేగంగా ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీపై విమర్శలు వెల్లువెత్తాయి.