హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కుందూనదికి చేరిన పోతిరెడ్డిపాడు నీరు

NDL: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి విడుదలైన నీరు బుధవారం ఉయ్యాలవాడ కుందూనదికి చేరింది. ప్రస్తుతం కుందూనదిలో మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఈ నీటిని తాగునీటికేనా, సాగునీటికి కూడా వాడుకోవచ్చా? అని అధికారులు స్పష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. సాగునీటి అవసరాలకు నీటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.